: నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు


నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి ఉందయం పది గంటల నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలో పెద్దనోట్ల రద్దుపై చర్చ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 వరకు జరుగుతాయి. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలను మరో పది రోజులపాటు పొడిగించనున్నారు. ఈ సందర్భంగా నిన్న నిర్వహించిన కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. విపక్షాలు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే విపక్షాలు ఎంతసేపు కావాలంటే అంత సేపు మాట్లాడనిద్దామని పేర్కొన్నారు. మరోవైపు విపక్షాలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, పలు సమస్యలపై చర్చించేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. దీంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తి రేగుతోంది. 

  • Loading...

More Telugu News