: నోట్ల రద్దు సబబే!: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఆర్బీఐ
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సబబేనని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు ఆర్బీఐ తెలిపింది. పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ఉమ్మడి హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లను సవాల్ చేస్తూ ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. దేశ ఆర్థిక సుస్థిరత, భద్రతను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ తెలిపింది. నకిలీ నోట్లతో కొందరు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొన్న ఆర్బీఐ, నోట్ల రద్దు నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం కాదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకున్నామని తెలిపింది.