: రెజీనాకు క్షమాపణలు చెప్పిన కృష్ణ వంశీ
టాలీవుడ్ యువనటి రెజీనా కాసాండ్రాకు దర్శకుడు కృష్ణ వంశీ క్షమాపణలు చెప్పాడు. కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న 'నక్షత్రం' సినిమాలో రెజీనా నటిస్తోంది. ఆమెతోపాటు సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. డిసెంబర్ 13న ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని నేడు నక్షత్రం సినిమా యూనిట్ ఒక ట్రైలర్ విడుదల చేసింది. అయితే పుట్టినరోజున ట్రైలర్ విడుదల చేయాల్సిందని, అయితే చేయలేకపోయామని, ఆలస్యమైనందుకు, ట్రైలర్ లో పుట్టిన రోజు డేట్ ను ప్రస్తావించనందుకు క్షమించాలని ఆయన కోరారు. అసలు చెప్పకపోవడం కన్నా ఆలస్యంగా చెప్పడం మంచిదేనని ఆయన పేర్కొన్నారు. దానికి రెజీనా ధన్యవాదాలు తెలిపింది. ట్రైలర్ రిలీజ్ చేసినందుకు చిత్ర యూనిట్ కు థ్యాంక్స్ చెప్పింది.