: నిడమానూరు సర్పంచ్ ఇంటి వద్ద ఉద్రిక్తత!
కృష్ణా జిల్లా నిడమానూరు సర్పంచ్ కోటేశ్వరరావు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి మారిన ఆయన ఇంటి వద్ద నుంచి ఈరోజు ర్యాలీ నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు యత్నించారు. అయితే, ఈ ర్యాలీకి అనుమతి ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. తమ ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ)ని కలిసి, ఈ మేరకు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ నేతలు వెళ్లారు. కాగా, వైఎస్సార్సీపీ సీనియర్ నేత రోజా సమక్షంలో కోటేశ్వరరావు నిన్న ఆ పార్టీలో చేరారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వెళ్లిన కోటేశ్వరరావు వాహనాలను దుండగులు దగ్ధం చేసిన విషయం తెలిసిందే.