: అతనెవరో తెలియదు.. వారం రోజులు మా ఇంట్లో తిష్టవేశాడు: సల్మాన్ ఖాన్


తమ జీవితంలో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయం గురించి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా వెల్లడించాడు. ప్రముఖ దర్శకుడు కరణ్ జొహర్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' షోలో పాల్గొన్న సల్మాన్ ఈ విషయాన్ని చెప్పాడు. ఓసారి తమ ఇంట్లో మంచి పార్టీ చేసుకున్నామని, ఈ పార్టీకి చాలా మందిని ఆహ్వానించామని, వారితోపాటు మరికొందరు కూడా వచ్చారని చెప్పాడు. దీంతో ఈ పార్టీ రెండో రోజు కూడా కొనసాగిందని తెలిపాడు. పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేశామని చెప్పాడు. ఆ పార్టీకి వచ్చిన ఒక వ్యక్తి ఆ తర్వాత వారం రోజులపాటు తమతోపాటే ఉన్నాడని చెప్పాడు. వారం తరువాత మధ్యాహ్న భోజన సమయంలో మాట్లాడుకుంటుండగా, ఉదయం మటన్ బాలేదని అన్నాడని సల్మాన్ చెప్పాడు. సరిగ్గా ఉడకలేదని ఆరోపించాడని గుర్తు చేసుకున్నాడు.

 దీంతో పక్కనే ఉన్న అర్భాజ్ ను చూసి...వీడికేమన్నా బుద్ధుందా? ఇంట్లో వాళ్లు వండితే బాలేదంటున్నాడు? మీ ఫ్రెండేనా? అని అడిగానని చెప్పాడు. తన ప్రశ్నతో షాక్ తిన్న అర్భాజ్, తను నా ఫ్రెండ్ కాదు నీ ఫ్రెండ్ అనుకుంటున్నానని చెప్పాడని తెలిపాడు. దీంతో తామిద్దరం కలిసి సోహెల్ వైపు చూడగా, తన ఫ్రెండ్ కాదని సైగ చేశాడని అన్నాడు. దీంతో ఇంట్లోని మహిళల స్నేహితుడేమోనని 'బేబీ మీ స్నేహితుడా?' అని అడుగగా, అతనెవరో తెలియదని వారు కూడా చెప్పారని తెలిపాడు. దీంతో నువ్వెవరు? ఎవరి స్నేహితుడివి? అని అడుగగా, తానెవరికీ ఫ్రెండ్ ను కాదని, వారం క్రితం నిర్వహించిన పార్టీకి తన స్నేహితుడితో కలిసి వచ్చానని, వాతావరణం బాగుండడంతో ఇక్కడే ఉండిపోయానని సమాధానమిచ్చాడని తెలిపాడు. దీంతో ఆశ్చర్యపోవడం తమ వంతైందని సల్మాన్ వెల్లడించాడు. 

  • Loading...

More Telugu News