: కుక్కల కోసం అంబులెన్స్ సర్వీసు ప్రారంభించిన అధికారులు
ఎవరైనా ఒక్కసారిగా అనారోగ్యానికి గురయితే లేదా ప్రమాదానికి గురయితే వెంటనే మనకు గుర్తుకొచ్చేది అంబులెన్స్. అయితే, అంబులెన్స్ సదుపాయం మనుషులకేనా? జంతువులకి ఎందుకు ఉండకూడదు? ఇటువంటి ఆలోచనే చేసిన చండీగఢ్ నగరంలోని పశుసంవర్థక శాఖ అధికారులు కుక్కల కోసం అంబులెన్సు సేవలను మొదలుపెట్టారు. ఎంపీల్యాడ్స్ నిధులతో ఈ సేవలను ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఈ సర్వీసు ద్వారా పారావెటర్నీర సిబ్బందికి ఫోను చేస్తే వెంటనే చేరుకుని పెంపుడు కుక్కలకు ప్రథమ చికిత్స చేస్తారని, అత్యవసర సమయంలో వాటికి చికిత్స అందిస్తారని చెప్పారు. నగరంలోని మఖన్ మజ్రా, జుమూరు ఫైదాన్, రాయపూర్ కలాన్, రాయపూర్ ఖుర్ధు ప్రాంతాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. తాము అందిస్తోన్న ఈ సర్వీసుకి ఒక్కొక్కరి నుంచి రూ.300 తీసుకుంటున్నట్లు తెలిపారు.