: కేసీఆర్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం ఎంతమంది తీసుకున్నారో తెలుసా?


ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో సభ్యత్వ నమోదు జోరుగా సాగుతోంది. ఇప్పటికే సభ్యత్వం తీసుకున్న వారి సంఖ్య 50 లక్షలు దాటింది. గడువులోగా 60 లక్షల మందిచేత సభ్యత్వం చేయించాలని టీడీపీ టార్గెట్ పెట్టుకుంది. మరోవైపు, తెలంగాణలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. సీమాంధ్రులు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో సైతం సభ్యత్వ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వీల్ లో అయితే... పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఇప్పటి వరకు కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే సభ్యత్వం తీసుకున్నారట. గతంలో చేపట్టిన సభ్యత్వ నమోదులో 18 వేల మంది సభ్యత్వం తీసుకున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం టీడీపీ సభ్యత్వ నమోదు కొంత వరకు ఆశాజనకంగా ఉందట.

  • Loading...

More Telugu News