: భిన్నకథనాలు చెబుతున్న కర్ణాటక మాజీ మంత్రి రాసలీలల వీడియోలో మహిళ
కర్ణాటక మాజీ మంత్రి హెచ్.వై.మేటి రాసలీలల వీడియో పలు కన్నడ టీవీ ఛానెళ్లలో నిన్న ప్రసారమవడం సంచలనం రేకెత్తించింది. అయితే, ఈ వీడియోలో ఉన్న మహిళ మాత్రం భిన్న కథనాలు చెబుతోంది. అసలు, ఆ వీడియోలో వున్నది తాను కాదని ఒకసారి, తానేనని మరోసారి, ‘మేటి తనకు తండ్రి వంటి వాడు’ అని ఇంకోసారి చెప్పడంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. తనను కొందరు బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని బాగల్కోటె జిల్లా ఎస్పీ ఎఎన్ నాగరాజ్ ను కలిసి ఈమేరకు ఆమె విన్నవించుకుంది. పోలీస్ రక్షణ కల్పించిన అనంతరం, తన ఆరోగ్యం బాగాలేదంటూ ఆసుపత్రిలో చేరింది. ఇంటికి వెళుతున్నానని చెప్పి గత రాత్రి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన ఆమె ఆచూకీ ఇంతవరకూ తెలియలేదని పోలీసులు చెబుతున్నారు. కాగా, బాగల్కోటె జిల్లాలోని నగర సభ కార్యాలయంలో సదరు మాజీ మంత్రి ఓ మహిళతో రాసలీలలు జరుపుతూ దొరికిపోయారు.