: యువతకు ఉద్యోగాలు లభిస్తే దేశానికి సంపద.. నిరుద్యోగులైతే అశాంతి: రాష్ట్రపతి


దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తే దేశానికి అది సంపదగా మారుతుందని, అదే వారు నిరుద్యోగులైతే అంశాతికి కారణమవుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో నిర్వహించిన సీఐఐ నైపుణ్య శిక్షణ కేంద్రం వార్షికోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి పై విధంగా వ్యాఖ్యానించారు. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని, దేశ జనాభాలో సగానికిపైగా పాతికేళ్లలోపు వారే ఉన్నారని అన్నారు. ఇది దేశానికి సవాలుగా మారే ప్రమాదముందన్నారు. ఉద్యోగానికి సర్టిఫికెట్లు ఉంటేనే సరిపోదని, అంతకుమించి నైపుణ్యం ఉండాలని అన్నారు. కాలేజీలు, యూనివర్సిటీల నుంచి ఏటా పెద్దసంఖ్యలో బయటకు వస్తున్న పట్టభద్రుల్లో చాలామంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని ప్రణబ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారు అలాగే మిగిలిపోతే అశాంతి, నిస్పృహ తీవ్రతరమవుతాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News