: గుజరాత్ లో ఐదు వేల మంది కోటీశ్వరులకు ఐటీ నోటీసులు


గుజరాత్ లోని కోటీశ్వరులకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దు అనంతరం కోటి రూపాయలు, అంతకంటే ఎక్కువ మొత్తం నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన 5 వేల మంది కోటీశ్వరులకు నోటీసులు జారీ చేసినట్టు ఆదాయపు పన్ను శాఖాధికారులు తెలిపారు. డిపాజిట్ చేసిన మొత్తాలకు సంబంధించిన వివరాలు అందజేయాలని నోటీసుల్లో ఆదేశించారు. ఆ డబ్బుకు ఆధారాలు ఉండాలని, అవి అక్రమమైనవని తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండున్నర లక్షల కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే నోటీసులు పంపుతామని నోట్ల రద్దు సందర్భంగా ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 5 వేల మందికి నోటీసులు పంపడం ఆసక్తి రేపుతోంది. 

  • Loading...

More Telugu News