: స్వాతంత్ర్య సమరయోధుడు ‘విశాఖ గాంధీ’కి ప్రముఖుల నివాళి.. ముగిసిన అంత్యక్రియలు
స్వాతంత్ర్య సమరయోధుడు, ‘విశాఖ గాంధీ’గా ప్రసిద్ధి చెందిన కొల్లూరు సత్యనారాయణ శాస్త్రి (95) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మరణించారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
కాగా, సత్యనారాయణ శాస్త్రికి భార్య రమణమ్మ, కొడుకు, కోడలు, మనవరాలు ఉన్నారు. వైజాగ్ లోని శ్రీనగర్ లో సత్యనారాయణ శాస్త్రి భార్యతో కలిసి నివసించేవారు. గాంధేయ మార్గాన్నే ఆయన జీవితాంతం అనుసరించారు. విశాఖలోని గాంధీ సెంటర్ వ్యవస్థాపక కార్యదర్శిగా నలభై ఏళ్ల పాటు వ్యవహరించారు. పలు ట్రేడ్ యూనియన్లకు నాయకుడిగా గతంలో పనిచేశారు.