: రామ్ చరణ్ కు ఘనస్వాగతం పలికిన అభిమానులు
‘ధృవ’ చిత్రం ప్రచారం నిమిత్తం ఇటీవల అమెరికా వెళ్లిన ప్రముఖ నటుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో రామ్ చరణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులను ఆయన ఆప్యాయంగా, నవ్వుతూ పలకరించారు. చెర్రీ అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.