dattanna: దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల కేసు తీర్పుపై కేంద్రమంత్రి దత్తాత్రేయ హర్షం
మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఇటీవలే ఐదుగురు హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాదులను నేరస్థులుగా పేర్కొంటూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పు ఉగ్రవాదులకు గుణపాఠమని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ అంతా ప్రజాస్వామ్య పద్ధతుల్లో కొనసాగిందని, ఎంతో మంది సాక్షుల నుంచి వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత కోర్టు నిందితులని దోషులుగా పేర్కొందని ఆయన అన్నారు. ఈ కేసు విచారణలో ఎంతో కృషి చేసిన ఎన్‌ఐఏ అధికారులను ఆయన అభినందించారు. కాగా, ఈ కేసులో దోషులకు ఈ నెల 19న న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది.