: అక్రమ నిర్మాణం విషయంలో టాప్ కమెడియన్ కపిల్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు


టాప్ కమెడియన్ కపిల్ శర్మపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎంఆర్టీపీ, పర్యావరణ భద్రతా చట్టాల కింద ఆయనపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే, ముంబైలోని తన బంగ్లాలో కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు మునిసిపాలిటీ అధికారులు లంచం అడిగారని... అచ్చేదిన్ అంటే ఇవేనా? అంటూ ఏకంగా ప్రధాని మోదీకే ట్వీట్ చేశాడు కపిల్ శర్మ. దీంతో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విచారణకు ఆదేశించారు. విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కపిల్ నివాసం మొత్తం అక్రమమైనదే అని... బంగ్లాను మొత్తం చట్ట విరుద్ధంగా నిర్మించారని తేలింది. ఈ నేపథ్యంలోనే కపిల్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదయింది. 

  • Loading...

More Telugu News