: శ్రీవారి హుండీలో చోరీకి యత్నం
తిరుమల శ్రీవారి హుండీలో ఒక వ్యక్తి చోరీకి యత్నించాడు. ఈ ఘటనను సీసీ టీవీలో గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిఘా విభాగం సిబ్బంది ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని శివకాశికి చెందిన నవనీత్ కృష్ణన్ శ్రీవారి హుండీలోని కానుకలు చోరీ చేసేందుకు యత్నించాడని టీటీడీ నిఘా విభాగం సిబ్బంది పేర్కొన్నారు.