: రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య.. కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువులో ఈ రోజు ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామంలోని 15 ఏళ్ల ఓ పదో తరగతి విద్యార్థి ఈ రోజు ఉదయం రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్తను తెలుసుకున్న ఆ విద్యార్థి తండ్రి కుమారుడి మృతి పట్ల తీవ్ర మనస్తాపం చెంది ఇండ్లచెరువులో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాల గురించి సమాచారం అందాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.