: 24 గంటల్లో 571 మందికి కటింగ్.. రికార్డులకు ఎక్కిన సూరత్ బ్యూటీషియన్


రికార్డులను క్రియేట్ చేయాలి, ఉన్న రికార్డులను బ్రేక్ చేయాలనే కోరిక భారతీయుల్లో ఈ మధ్య కాలంలో అధికమైంది. ప్రపంచంలోని రికార్డులను అధిగమించేందుకు పలువురు భారతీయులు తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ లోని సూరత్ నగరానికి చెందిన ఓ బ్యూటీషియన్ పాత రికార్డును బద్దలు కొట్టింది. వివరాల్లోకి వెళ్తే, ఆ బ్యూటీషియన్ పేరు శీతల్ కాల్పేష్ షా. ఓ రోజు తన భర్తతో మాట్లాడుతుండగా, ఏదైనా రికార్డ్ సాధించాలనే ఆలోచన వచ్చింది. దీంతో, తన బ్యూటీ పార్లర్ లోనే మహిళలకు జుట్టు కత్తిరించే పనిని మొదలుపెట్టింది. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 9.14 గంటల నుంచి 24 గంటలపాటు విరామం లేకుండా 571 మందికి కటింగ్ చేసి, రికార్డు నెలకొల్సింది. గతంలో 24 గంటల్లో 512 మందికి జుట్టు కత్తిరించిన రికార్డు ఓ జంట పేరుమీద ఉంది. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. రికార్డును సాధించిన శీతల్ ను పలువురు అభినందనలతో ముంచెత్తుతున్నారు. 

  • Loading...

More Telugu News