: 13 ఏళ్ల విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం... స్కూలుపై స్థానికుల దాడి


విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు కీచకుడిగా మారిన ఘటన ముంబైలో చోటుచేసుకోవడంతో అన్నెంపున్నెం ఎరుగని వయసులోనే విద్యార్థిని గర్భందాల్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే... నవీ ముంబైలో ఉంటున్న ఓ ప్రైవేటు స్కూలులో చదువుకుంటున్న 13 ఏళ్ల బాలికపై ఆ స్కూల్ లో పనిచేసే టీచర్ ఒకరు కన్నేశాడు. అతను బాలికను మాయమాటలు చెప్పి లొంగదీసుకుని గత కొన్ని నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలిక కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో తల్లి బాలికను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది.

అక్కడ బాలికను పరీక్షించిన వైద్యుడు నాలుగు వారాల గర్భవతి అని తల్లికి తేల్చిచెప్పాడు. దీంతో పూణేలో ఉద్యోగం చేసే భర్తకు విషయం వివరించడంతో ఆయన నెహ్రూ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన నివాసానికి వచ్చి, స్థానికులతో కలిసి స్కూలుపై దాడికి దిగాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, విషయం తెలుసుకుని, ప్రిన్సిపల్ ను అదుపులోకి తీసుకున్నారు. జరిగిన దారుణంపై బాలిక ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా ప్రిన్సిపల్ ఎలాంటి చర్య తీసుకోలేదన్న ఆగ్రహంతో వారు స్కూలుపై దాడికి దిగారు. ఈ ఘటనలో స్కూలు టీచర్ పరారీలో ఉన్నాడు. అతనిపై అత్యాచారం, పిల్లలపై దాష్టీకం వంటి కేసులు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. 

  • Loading...

More Telugu News