: నన్ను లైంగికంగా వేధించారు: హీరోయిన్ సోనమ్ కపూర్


బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ముద్దుల కుమార్తె, నటి సోనమ్ కపూర్ ఈ మధ్య మరీ బోల్డ్ స్టేట్ మెంట్లు ఇచ్చేస్తోంది. ఇటీవలే నేహాధూపియా షోలో శృంగార సంబంధాలపై నిర్మొహమాటంగా మాట్లాడిన ఈ భామ... ఇండస్ట్రీలో తనకు ఎవరితోనూ సెక్సువల్ కాంటాక్ట్స్ లేవని చెప్పింది. సినీరంగంలో ఎవరితోనూ శృంగారంలో పాల్గొనలేదు కాబట్టే... అందరితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పింది.

తాజాగా ఫిలిం క్రిటిక్ రాజీవ్ మన్సద్ షోలో సోనమ్ మరోసారి మొహమాటం లేకుండా మాట్లాడింది. తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పింది. తన చిన్నతనంలో తనను లైంగికంగా వేధించడం తనకు ఇంకా గుర్తుందని తెలిపింది. ఆ ఘటన తనను ఇంకా వేధిస్తోందని చెప్పింది. ఈ షో ఇంకా ప్రసారం కాలేదు. ఈ ఇంటర్వ్యూలో ఆమెతో పాటు బాలీవుడ్ హీరోయిన్లు అనుష్క శర్మ, అలియా భట్, విద్యాబాలన్, రాధికా ఆప్టేలు కూడా పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News