20 నిమిషాల్లో మా నూడుల్స్ తినండి.. సర్ప్రైజ్ గిఫ్ట్ పట్టుకెళ్లండి: ఓ రెస్టారెంట్ భారీ ఆఫర్!
ఒకవేళ తినలేక వదిలేస్తే మాత్రం 88 డాలర్లు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. పోటీకి దిగిన వారు నెగ్గడానికి ఓ సదుపాయం కూడా ఇస్తున్నారు. ఒకవేళ 20 నిమిషాల్లో నూడుల్స్‌ను తినలేపోతే పోటీకి దిగిన వ్యక్తికి మరో 10 నిమిషాలు సమయం ఇస్తారు. అయితే, మరో పదినిమిషాలు సమయం తీసుకున్న వారు ఒకవేళ గెలిస్తే 438 డాలర్లు కాకుండా 236 డాలర్లను బహుమతిగా ఇస్తారు. ఈ పోటీలో పాల్గొనాలనుకునే వారు ముందుగా 26 డాలర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పోటీ గత మూడేళ్లగా నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు గెలిచినవారి సంఖ్య 9 మాత్రమేనని నిర్వాహకులు చెబుతున్నారు.