: ఆ చికిత్స జయలలితను కాపాడలేకపోయింది... కానీ, టెక్కీని బతికించింది!


దివంగత ముఖ్యమంత్రి జయలలిత కార్డియాక్ అరెస్ట్ కు గురైన తర్వాత... ఆమెను బతికించడానికి ఎక్మో యంత్రంతో చికిత్స చేశారు. అయినా, ఆమె ప్రాణాలను మాత్రం ఆ చికిత్స కాపాడలేకపోయింది. కానీ, ఇదే చికిత్స ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కాపాడింది. వివరాల్లోకి వెళ్తే, 43 ఏళ్ల టెక్కీ శ్రీనాథ్ కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యాడు. హఠాత్తుగా అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఎంతో ఆరోగ్యంగా ఉండే శ్రీనాథ్ కు ఇలా జరగడంతో వారి కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. వెంటనే బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు జయలలితకు చేసిన ఎక్మో చికిత్సను శ్రీనాథ్ కు చేశారు. 24 గంటలు తిరిగేలోపల శ్రీనాథ్ గుండెను మామూలుగా కొట్టుకునే స్థితికి తీసుకువచ్చారు. తనకు పునర్జన్మ ఎత్తినట్టు ఉందని ఈ సందర్భంగా శ్రీనాథ్ తెలిపాడు.

నారాయణ హృదయాలయ ఇప్పటివరకు 500 మందికి ఎక్మో చికిత్సను అందించిందట. ఈ చికిత్సకు రూ.  3 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ చికిత్సపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. విషమ పరిస్థితికి గురైన గుండెను కూడా ఈ చికిత్స ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చట. అయితే, మన దేశంలో ఎంతో మంది గుండె కొట్టుకోవడం ఆగిపోవడం ద్వారా మరణిస్తున్నప్పటికీ... అందరికీ ఈ చికిత్స అందుబాటులో ఉండటం లేదు. ఈ చికిత్సను రెండు పరిస్థితుల్లో చేస్తారు. ఒకటి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు, రెండోది న్యుమోనియా లేదా గాయాల వల్ల ఊపిరితిత్తులు సరిగా పనిచేయనప్పుడు ఎక్మో ద్వారా చికిత్సను అందిస్తారు. 

  • Loading...

More Telugu News