: అపచారం: తిరుమలలో శ్రీవారి ఆలయం సమీపంలోనే కూర్చొని దర్జాగా పెగ్గులు వేసిన యువకులు
తిరుమలలో మందుబాబులు మరోసారి రెచ్చిపోయారు. కొండపైనే దర్జాగా కూర్చోని పెగ్గులు వేసేశారు. ఈ అపచారాన్ని గుర్తించడంలో భద్రతా సిబ్బంది విపలమయ్యారు. శ్రీవారి ఆలయానికి దగ్గరలోని అర్చక నిలయం దగ్గర పట్టపగలే కొందరు యువకులు మద్యం తాగుతూ మీడియా కంటపడ్డారు.
సాధారణంగా తిరుపతికి ముఖద్వారమైన అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది భక్తులను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈ తరువాత జీఎన్‌సీ టోల్‌గేటు వద్ద కూడా మరోసారి సోదాలు నిర్వహిస్తారు. అయినప్పటికీ తిరుమలకు అక్రమంగా మద్యం చేరుకుంటోంది. శ్రీవారి ఆలయానికి సమీపంలోనే యువకులు మద్యం సేవించడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా అక్కడకు వచ్చిందని తెలుసుకున్న మందుబాబులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు.