: కోహ్లీకి లతా మంగేష్కర్ అరుదైన బహుమతి


టాప్ ఫామ్ లో ఉన్న టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్వరూపమే ప్రదర్శిస్తున్నాడు. బ్యాటింగ్ కు దిగితే సెంచరీ... వీలు కాకపోతే హాఫ్ సెంచరీ... ఇలా కొనసాగుతోంది అతడి బ్యాటింగ్. ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్టులో అద్భుతమైన డబుల్ సెంచరీని కూడా నమోదు చేశాడు విరాట్. అతడి బ్యాటింగ్ శైలికి దిగ్గజాలు సైతం అచ్చెరువొందుతున్నారు. ఈ క్రమంలో మన దేశానికి గర్వకారణమైన గాయని లతా మంగేష్కర్ కూడా కోహ్లీ ఆటను చూసి ఎంతో మురిసిపోయారు. ఎంతోమంది లాగానే ఆమె కూడా కోహ్లీని అభినందించాలనుకున్నారు. అయితే, అందరిలా కాకుండా అరుదైన రీతిలో కోహ్లీని ఆమె అభినందించారు. 235 పరుగులు చేసిన కోహ్లీకి నా అభినందనలు అంటూ ట్వీట్ చేసిన ఆమె... తాను పాడిన 'ఆకాశ్ కే ఉస్ పార్ భీ' అనే పాట యూట్యూబ్ లింక్ ను కూడా జతచేశారు. కోహ్లీ ప్రతిభ ఆకాశాన్నంటుతోందనే భావనతో ఆమె ఈ పాటను బహుమతిగా ఇచ్చారు. 

  • Loading...

More Telugu News