: రియల్ లైఫ్ మౌగ్లీ...జంతువులతో సహవాసం!
‘జంగిల్ బుక్’ లోని కామిక్ పాత్ర మోగ్లీ గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్యే వచ్చిన 'జంగిల్ బుక్' సినిమా అత్యంత విజయవంతమైన సంగతి తెలిసిందే. అచ్చం ఆ కల్పిత పాత్రను పోలిన విధంగా ఓ బాలిక పెరగడం విశేషం. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో నివసించే టిప్పి బెంజిమన్ ఒకంటీ డెగ్రే (26) బాల్యం మొత్తం నమీబియాలోని క్రూర మృగాలు, ఆటవిక జాతుల మధ్య గడిచింది. టిప్పి అలా గడపడానికి కారణం తన తల్లిదండ్రులు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు కావడమే. దీంతో తన తల్లిదండ్రుల వెంట టిప్పి వెళ్లేది. దీంతో అక్కడి ఆటవిక ప్రజలు పెంచుకునే ఏనుగులు, చిరుతలతో మంచి స్నేహం పెంచుకుంది. ఉష్ణపక్షులపై సవారీ చేసేది. పదేళ్ల పాటు వాటితో ఆమెకు అంతులేని అనుభవాలు, అనుభూతులు పెనవేసుకున్నాయి. ఈ అనుభవాలతో పెద్దయ్యాక ‘అరౌండ్ ద వరల్డ్ విత్ టిప్పి’ పేరిట డాక్యుమెంటరీ కూడా చేసింది.