వారసురాలు: జయలలితకు నిజమైన వారసురాలిని నేనే: దీప
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అసలైన వారసురాలిని తానేని ఆమె మేనకోడలు (జయ సోదరుడు జయకుమార్ కుమార్తె) దీప తెలిపింది. చెన్నైలో ఆమె మాట్లాడుతూ, ప్రజలు కోరుకుంటే తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన మేనత్త జయలలిత లేని లోటును శశికళ భర్తీ చేస్తారని ఏఐఏడీఎంకే నేతలు పేర్కొనడం దురదృష్టకరమని ఆమె తెలిపారు. ఏ రకంగా చూసినా తన మేనత్తకు వారసురాలిని తానేని ఆమె స్పష్టం చేశారు. కాగా, గతంలో ఆమె పోయిెస్ గార్డెన్ లోని జయలలితకు చెందిన ఇంటిలో తనకు వాటా ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే.