: అసోంలో స్వల్ప భూకంపం
అసోం రాష్ట్రంలో స్వల్ప భూకంపం సంభవించింది. అసోంలోని ఆంగ్ లాంగ్ ప్రాంతంలో నేటి మధ్యాహ్నం ప్రకంపనలు సంభవించాయి. కాళ్ల కింద భూమి కంపించడంతో ఒక్కసారిగా స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1 గా నమోదైంది. స్వల్ప భూకంపం కావడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.