: చివరి టెస్టు మ్యాచ్ చెన్నైలోనే... వేదిక మార్పు లేనట్టే!


ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో చివరి మ్యాచ్ చెన్నైలో జరగాల్సి ఉంది. అయితే జయలలిత మరణంతో, వేదికను మార్చాలని తొలుత బీసీసీఐ భావించింది. అనివార్య పరిస్థితులు ఏవైనా తలెత్తే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే, ప్రస్తుతం చెన్నైలో పరిస్థితులు బాగానే ఉండటంతో... వేదిక మార్చాల్సిన అవసరం లేదని భావిస్తోంది. అంతేకాదు, తమిళనాడు స్పోర్ట్స్ అథారిటీ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, మ్యాచ్ చెన్నైలోనే జరుగుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News