: వార్దా తుపాను ప్రభావిత రాష్ట్రాలకు చేరుకుంటున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
వార్దా తుపాను ముంచుకొస్తోన్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఆర్‌ఎఫ్) బృందాలు అప్రమత్తమయ్యాయి. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లకు ఈ బృందాలు కదిలాయి. చెన్నయికి మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లగా, తిరువళ్లూరుకు రెండు బృందాలు, కాంచీపురం జిల్లాకు రెండు బృందాలు వెళ్లినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతమయిన పుదుచ్చేరికి మరో బృందం వెళ్లినట్లు పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. గుంటూరుకు మరో బృందాన్ని పంపించారు. అంతేగాక తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సాయం అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ అదనపు బృందాలు అరక్కోణంలో మరికొన్ని సిద్ధంగా ఉన్నాయి.