: సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకుంటే ఆ దేశం పది ముక్కలు అవుతుంది: రాజ్ నాథ్ సింగ్


గతంలో పాకిస్థాన్ రెండు దేశాలుగా చీలిపోయిందని, ఒకవేళ సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకుంటే ఆ దేశం త్వరలోనే పది ముక్కలుగా విచ్ఛిన్నమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా జమ్మూకాశ్మీర్ లోని కథువాలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం భారత్ ను ఎవరి ముందూ తలదించుకోనివ్వదని అన్నారు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మన దేశంపై పాక్ నాలుగు సార్లు దాడి చేసిందని, అన్ని సార్లు పాక్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పామని రాజ్ నాథ్ అన్నారు. యూరీ ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ ను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం అనేది పిరికిపందల ఆయుధం అని ఆయన మండిపడ్డారు. సరిహద్దుల్లో ఎలాంటి కాల్పుల విరమణ ఉల్లంఘనలకైనా పాకిస్థాన్ పాల్పడితే తగిన రీతిలో బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా రాజ్ నాథ్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News