: టీ విరామానికి ఇంగ్లాండు 49/3
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో టీ విరామ సమయానికి 49 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. కుక్ (18), మొయిన్ అలీ(0)లు జడేజా బౌలింగ్ లోనే అవుటయ్యారు. జట్టు స్కోరు 43 వద్ద కుక్ ని వికెట్ల ముందే జడేజా అవుట్ చేయగా, జడేజా వేసిన బంతిని కొట్టిన మొయిన్ అలీ మురళీ విజయ్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాగా, జోరూట్ (30), బెయిర్ స్టో(0) క్రీజ్ లో ఉన్నారు.