: ఇంగ్లాండు మొదటి వికెట్ పతనం
తొలి ఇన్నింగ్స్ లో 231 పరుగులు వెనుకబడిన ఇంగ్లాండు జట్టుకు రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముంబయిలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండు రెండో ఇన్నింగ్స్ లో మొదటి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో ఇంగ్లాండు ఓపెనర్ జెన్నింగ్స్ తొలి బంతికే ఔటయ్యాడు. కాగా, తొలి టెస్ట్ లో 112 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించిన జెన్నింగ్స్ రెండో ఇన్నింగ్స్ లో డక్కవుట్ అయ్యాడు.