: ఆ దేశంలో వాహనాలకే కాదు, ఒంటెలకు కూడా రిజిస్ట్రేషన్ ప్లేట్ వుంటుంది!


ఇరాన్ దేశంలో వాహనాలకే కాదు, ఒంటెలకు కూడా ప్రభుత్వ రిజిస్టర్డ్ లైసెన్స్ ప్లేట్ తప్పనిసరి. ఇరాన్ లో రోడ్లపై వాహనాలతో పాటు ఒంటెలు అధికంగానే తిరుగుతుంటాయి. వీటి వల్ల బలూచిస్థాన్ ప్రావిన్స్, ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయట. కొన్ని ఒంటెలు దారి తప్పి.. మరికొన్ని పారిపోయి రోడ్లపైకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో, అక్కడి అధికారులు ఒంటెలను, వాటి యజమానులను గుర్తించేందుకు వీలుగా వాటికి రిజిస్ట్రేషన్ చేసి లైసెన్స్ ప్లేట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మొదటి విడతలో భాగంగా ఇప్పటికే ఒక లక్ష ఒంటెలకు నంబర్ ప్లేట్లు కేటాయించారు. మరో 35 వేల ఒంటెలకు కేటాయించే పనిలో ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News