: పొగ మంచు కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం


దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది. ఫలితంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నాలుగు రైళ్లను అధికారులు రద్దు చేశారు. 28 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఆదివారం ఉదయానికి సుమారు 90 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒకవైపు చలి, మరోవైపు ఆలస్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దయిన రైళ్లలో రెవా - ఆనంద్ విహార్ టెర్మినల్ ఎక్స్ ప్రెస్, న్యూఢిల్లీ - జయనగర్ స్వంత్రత సేనాని ఎక్స్ ప్రెస్, అజమ్ గడ్ - ఢిల్లీ కఫియత్ ఎక్స్ ప్రెస్, న్యూఢిల్లీ - రాజేంద్ర నగర్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ఉన్నాయి. మరోవైపు విమానాల పరిస్థితీ ఇలానే ఉంది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన మూడు విమానాలు, టేకాఫ్ తీసుకోవాల్సిన ఐదు విమానాల్లో ఆలస్యం నెలకొంది. నాలుగు విమాన సర్వీసులను రద్దు చేశారు. శనివారం కూడా దట్టమైన పొగ మంచుతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఈ నెల 16 వరకు ఢిల్లీలో ఇవే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News