: జయలలిత నివాసం వద్ద అన్నా డీఎంకే కార్యకర్తల ఆందోళన.. ఉద్రిక్తత
చెన్నయ్ లోని పోయెస్ గార్డెన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని దివంగత జయలలిత నివాసంలో ప్రస్తుతం ఆమె నెచ్చెలి శశికళ తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత అనంతరం శశికళను పార్టీ చీఫ్ గా చేయాలన్న నేతల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అన్నాడీఎంకే కార్యకర్తలు పోయెస్ గార్డెన్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని, అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.