: తిండికి ఈ ఆరు దేశాల ప్రజలు సంపాదనలో పది శాతం కూడా ఖర్చు చేయడం లేదు
తిండి కలిగితే కండ కలుగునోయ్... కండకలిగినవాడే మనుజుడోయ్ అన్నారు మహాకవి గురజాడ అప్పారావు. అయితే తిండి కలగాలంటే ఆదాయం సరిపడినంత ఉండాలి. అలా సరిపడినంత ఆదాయం ఉన్నప్పటికీ తమ ఆదాయంలో కేవలం పది శాతం కూడా ఖర్చు చేయని ప్రజలు ఉన్నారు. ప్రపంచంలోని ఆరుదేశాల్లో ఉన్న ప్రజలు తమ సంపాదనలో కనీసం పది శాతం కూడా ఖర్చు చేయడం లేదు. వారి వివరాల్లోకి వెళ్తే...అగ్రరాజ్యం అమెరికా తమ ఆదాయంలో సరాసరి సగటున ఏడాదికి 6.4 శాతం తిండి కోసం ఖర్చు చేస్తూ ఈ జాబితాలో అగ్రస్థానం సంపాదించింది. అంటే వారేమీ తినరని అర్ధం కాదు. ప్రతి అమెరికన్ తన సంపాదనలో ఏడాదికి 2,392 (1,61,424 రూపాయలు) అమెరికన్ డాలర్లు ఖర్చు చేస్తాడు. ఆ తరువాత స్థానంలో 6.7 శాతం ఖర్చుతో సింగపూర్ నిలిచింది. దాని తరువాతి స్థానంలో బ్రిటన్ (8.2 శాతం) నిలవగా, నాలుగో స్థానంలో స్విట్జర్లాండ్ (8.7 శాతం), ఐదో స్థానంలో కెనడా (9.1 శాతం), ఆరో స్థానంలో ఐర్లాండ్ (9.6 శాతం), ఏడో స్థానంలో ఆస్ట్రేలియా (9.8 శాతం), ఎనిమిదో స్థానంలో ఆస్ట్రియా(9.9 శాతం) లు నిలవడం విశేషం.