: అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసు: వైమానిక దళ మాజీ అధిపతి త్యాగికి నాలుగు రోజుల సీబీఐ రిమాండ్


అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో అరెస్ట‌యిన వైమానిక దళ మాజీ అధిపతి ఎస్‌.పి.త్యాగిని సీబీఐ అధికారులు ఈ రోజు ఢిల్లీలోని పటియాలా హౌజ్‌కోర్టుకు త‌ర‌లించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో త్యాగి పాత్ర ఉందనడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసులో సీబీఐ అధికారుల‌ పలు వాద‌న‌లు విన్న కోర్టు త్యాగితో పాటు పాటు గౌతమ్‌ ఖైతాన్‌, జులీ త్యాగిలకు నాలుగురోజుల సీబీఐ రిమాండ్ విధించింది. కేసులో వారిని విచారించిన అనంత‌రం మ‌ళ్లీ వారిని ఈ నెల 14న కోర్టులో హాజ‌రుప‌ర‌చాల‌ని సూచించింది. మ‌రోవైపు ఎస్‌.పి.త్యాగిని ఈ కేసులో అరెస్టు చేసిన విష‌యంపై ప్ర‌స్తుత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ను విలేక‌రులు ప్ర‌శ్నించారు. అయితే, జుడిషియ‌ల్ ప్రక్రియ కొన‌సాగుతున్నందున‌ ఇప్పుడు తాను ఈ కేసులో ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌ద‌లుచుకోలేద‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News