: జయ వీలునామాపై 'నో కామెంట్' అన్న అన్నాడీఎంకే
గత ఏడాది ఎన్నికల సందర్భంగా తనకు రూ. 113.72 కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇందులో రూ. 41.63 కోట్ల చరాస్తులు, రూ. 72 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని ఆమె వెల్లడించారు. మరి, ఈ ఆస్తులకు సంబంధించి ఆమె ఏదైనా వీలునామా రాశారా? లేదా? అనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. ఇదే విషయాన్ని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి పొన్నయన్ వద్ద ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావిస్తూ, 'జయ ఏమైనా వీలునామా రాశారా?' అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఆయన 'ఈ ప్రశ్నకు సమాధానం లేదు' అని చెప్పారు. పోయెస్ గార్డెన్ ను జయ స్మారక చిహ్నంగా మారుస్తారా? అనే ప్రశ్నకు బదులుగా... ఆ విషయాన్ని పార్టీ హైకమాండ్, ఎగ్జిక్యూటివ్, జనరల్ కమిటీలు నిర్ణయిస్తాయని తెలిపారు.