: గుజరాత్‌లో తన తల్లిని కలిసి 20 నిమిషాలు ముచ్చటించిన ప్రధాని మోదీ
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. అక్కడి దీసాలో పాల ఉత్పత్తి సహకార కేంద్రంతో పాటు పలు ప్రాజెక్టులను ప్రారంభించి ప్రసంగించిన ఆయన.. అనంతరం అక్కడి నుంచి గాంధీనగర్‌లోని తన సోదరుడు పంజక్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న తన తల్లి హీరాబా(97)ను కలిసి ఆమెతో సుమారు 20 నిమిషాల పాటు ముచ్చటించారు. కోబాలో నిర్వహించనున్న బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనే ముందు మోదీ తన తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారని బీజేపీ శ్రేణులు తెలిపాయి. మోదీ ఇంతకు ముందు ఈ ఏడాది సెప్టెంబరు 17న తన పుట్టిన రోజు వేడుక సందర్భంగా గుజరాత్ కు వచ్చి తన తల్లిని కలిశారని, మళ్లీ ఇప్పుడు కలిసి ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారని వారు అన్నారు.