: అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు శశికళకే... సాకారమైన శశికళ కల


అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను శశికళకు అప్పగిస్తూ ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొన్నటి వరకు ఈ పదవిలో జయలలిత ఉండేవారు. పార్టీ బాధ్యతలన్నింటినీ శశికళకు అప్పగిస్తూ ఈ రోజు పార్టీ కార్యవర్గం నిర్ణయించింది. అమ్మ జయలలిత చూపిన దారిలో పార్టీని నడపాలని శశికళను పార్టీ నేతలు కోరారు. దీంతో, పార్టీ అధినేత్రిగా వ్యవహరించాలన్న ఆమె కల సాకారమయినట్టయింది. పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు శశికళ నాయకత్వం ఇష్టం లేకపోయినా... ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మద్దతు ఆమెకు ఉండటంతో... ఆమె పని సులువయింది.

  • Loading...

More Telugu News