: జయలలిత ముందు రోజే చనిపోయారా? అపోలో ప్రకటన వెనుక నేతల ఒత్తిడి?


దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. అపోలో హాస్పిటల్ ప్రకటన ప్రకారం డిసెంబర్ 5న (సోమవారం) రాత్రి 11.30కి జయ మృతి చెందారు. అయితే, అంతకు ముందు రోజే... అంటే డిసెంబర్ 4న గుండెపోటు వచ్చినట్టు వైద్యులు చెప్పినప్పటికే జయ చనిపోయారనే వాదనకు బలం చేకూరుతోంది. ఎందుకంటే, ఆదివారం సాయంత్రానికే జయ అంత్యక్రియలకు అన్నాడీఎంకే నేతలు ఏర్పాట్లు మొదలు పెట్టారట. జయ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచిన రాజాజీ హాలును శుభ్రం చేయాలని ఆదివారమే ఆదేశాలు అందాయట. దీంతో, ముందు రోజే జయ చనిపోయిన విషయం పార్టీలోని కీలక నేతలకు తెలిసి ఉంటుందనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అధికార అన్నాడీఎంకే నేతల ఆదేశాల మేరకే... అపోలో ఆసుపత్రి యాజమాన్యం సోమవారం అర్ధరాత్రి జయ మరణించినట్టు ప్రకటించిందని కొందరు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News