: బిడ్డా! నోటికేదొస్తే అది మాట్లాడుతున్నారు... ఒళ్లు దగ్గర పెట్టుకోండి!: తలసాని
తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఆ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నాలుక చీరేస్తారని హెచ్చరించారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని సూచించారు. శాసన సభ సమావేశాలకు వచ్చినప్పుడు వారికి ఏ శాస్తి చేయాలో అది చేస్తామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తారు, పనులు అడ్డుకుంటారు, దుష్ప్రచారం చేస్తారు, మళ్లీ నోటికెంతొస్తే అంత మాట్లాడుతారని ఆయన మండిపడ్డారు.