: జయ వ్యతిరేకించిన ప్రాజెక్టుకు పన్నీర్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్


అమ్మ జయలలితకు వీర విధేయులం, విశ్వాసపాత్రులం అంటూ చెప్పుకునే నాయకుల అసలు స్వరూపం బయటపడుతోంది. జయ నమ్మిన బంటు, ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అధ్యక్షతన ఈ రోజు తమిళనాడు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో మధురవాయల్-చెన్నై పోర్టు ఫ్లైఓవర్ పనులను పునరుద్ధరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ, గతంలో ఈ ప్రాజెక్టును జయ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు ఆమె చనిపోయి నాలుగు రోజులు కూడా గడవక ముందే... ఆమెకు ఇష్టం లేని పనులకు ఆమోదముద్రలు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో మరి.

  • Loading...

More Telugu News