: స్వాతంత్ర్యం కావాలని నినదించిన పీఓకే... నిరసనకారులపై పాక్ సైన్యం దాష్టీకాలు!
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు తమకు స్వాతంత్రం కావాలని, తక్షణం పాకిస్థాన్ తమను వదిలిపెట్టాలని నిరసనలు తెలియజేస్తున్న వేళ, ఆ దేశపు సైన్యం అత్యంత కిరాతకంగా నిరసనలను అణచి వేస్తున్నట్టు తెలుస్తోంది. పాక్ పాలకుల వైఖరిని వ్యతిరేకిస్తూ, వేలాది మంది వీధుల్లో రాస్తారోకోలు, ధర్నాలు చేస్తుండగా, వీరిని అణచివేయాలని సైన్యానికి ఆదేశాలు అందాయి. ఆ వెంటనే సైన్యం ప్రజలు, నిరసనకారులపై దారుణంగా ప్రవర్తిస్తూ, వారిని చిత్ర హింసలకు గురి చేస్తున్నట్టు వార్తలందుతున్నాయి. దొరికిన వారిని దొరికినట్టు కొడుతూ, వాళ్లను జైళ్లకు తరలిస్తూ, ఇబ్బందులు పెడుతున్నట్టు తెలుస్తోంది. కాగా, జూలై 21న జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ - నవాజ్ పార్టీ మొత్తం 41 సీట్లకు గాను 32 సీట్లను గెలుచుకున్న సంగతి, ఈ ఎన్నికలలో పాక్ ప్రభుత్వం రిగ్గింగ్ చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతీ తెలిసిందే.