: తెల్ల త‌ల‌వెంట్రుక‌లు, తెల్ల మీసాల‌తో ఐన్‌స్టీన్ గెట‌ప్ వేసి గిన్నీస్ బుక్‌లోకి ఎక్కిన చిన్నారులు


దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో జ‌రుగుతున్న ఇండియా సైన్స్ ఫెస్టివ‌ల్‌లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెల్ల త‌ల‌వెంట్రుక‌లు, తెల్ల మీసాల‌తో మేధావి ఐన్‌స్టీన్ గెట‌ప్ వేసి అల‌రించారు. అంతేకాదు, గిన్నీస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఏకంగా 524 మంది విద్యార్థులు ఐన్‌స్టీన్ గెట‌ప్‌లో క‌నిపించి ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. గ‌త ఏడాది ఐన్‌స్టీన్ గెట‌ప్‌లో ఇదే రికార్డును కాలిఫోర్నియాలోని స్కూలు విద్యార్థులు నెల‌కొల్పారు. ఆ రికార్డును నెలకొల్పడానికి అప్పట్లో 304 మంది స్కూలు విద్యార్థుల అందులో పాల్గొన్నారు. ఇప్పుడు 524 మంది విద్యార్థులు పాల్గొని ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టారు.

  • Loading...

More Telugu News