: ఆరునెలల క్రితం తనకు మత్తు మందిచ్చి అత్యాచారం చేశారని పోలీసులకు యువతి ఫిర్యాదు
హైదరాబాద్ మల్కాజిగిరిలో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మల్కాజిగిరి ప్రశాంత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే 22 ఏళ్ల యువతి ఓ సంస్థలో పని చేస్తోంది. అదే సంస్థలో పనిచేస్తోన్న ఒక యువకుడు, అతడి స్నేహితుడు తనను 2016 జూన్ 29న వరంగల్ జాతీయ రహదారి ఘట్‌కేసర్ సమీపంలో ఉన్న రెస్టారెంట్‌లోని ఓ గదిలో భోజనం చేద్దామని తీసుకెళ్లారని, అయితే ఆ భోజనంలో వారు మత్తుమందు కలపడంతో తాను మత్తులోకి వెళ్ళినట్లు తాజాగా ఆ యువతి పోలీసులకి తెలిపింది. అనంతరం తనపై తన తోటి ఉద్యోగి సతీష్, అతని స్నేహితుడు జావీద్ అత్యాచారం చేశారని పేర్కొంది. ఈ విషయాన్ని నిందుతులే తనకు స్వయంగా చెప్పారని, ఈ విషయాన్ని ఎవరికయినా చెబితే చంపేస్తామని వారు బెదిరించారని ఆమె తెలిపింది. దీంతో భయపడి పోయిన తాను ఇన్ని రోజులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.