: కృష్ణా నదిలో మొసలి... మహిళలపై దాడి
కొందరు మహిళలు దుస్తులు ఉతికేందుకు కృష్ణా నదిలోకి దిగారు. అయితే నీటిలో పొంచి ఉన్న ఓ మొసలి మహిళలపై దాడి చేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లా అడవిదేవుల పల్లి మండలం చిట్యాల గ్రామంలో జరిగింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడకు వచ్చి మొసలి మెడకు ఉచ్చు వేసి బంధించారు. ఆ తర్వాత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిట్యాల గ్రామంలో గ్రామస్తులపై మొసలి దాడి చేయడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి.