: పోస్టల్ ఉద్యోగి సుధీర్‌బాబు బంధువుల ఇళ్లలోనూ సోదాలు.. రూ.70 లక్షలు స్వాధీనం
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు తపాలా కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకున్న సీబీఐ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబు భారీగా అక్రమమార్గంలో నగదును తరలించాడని గుర్తించిన అధికారులు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఈ రోజు ఉదయం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అధికారులు రూ.70 లక్షల కొత్తనోట్లు స్వాధీనం చేసుకున్నారు. సుధీర్‌బాబు మొత్తం మూడు తపాలా కార్యాలయాల్లో రూ.3 కోట్ల మేర పాత నోట్లను నిబంధనలకు విరుద్ధంగా మార్చినట్లు, ఆయనపై మొత్తం 3 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సుధీర్ బాబు నల్ల కుబేరుల నుంచి పాత నోట్లు మార్చినందుకు గానూ కమీషన్‌గా కొత్తనోట్లు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.