: బాంబేసిన ట్రంప్... భారత ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం!


డొనాల్డ్ ట్రంప్ బాంబేశారు. విదేశీ ఉద్యోగులను తెచ్చి, అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలను వారికి ఇస్తుంటే చూస్తూ ఊరుకోబోనని, అలా వచ్చే హెచ్-1బీ వీసా దారులను అడ్డుకుంటానని తేల్చి చెప్పారు. హెచ్-1బీ వీసాలతో వచ్చి అమెరికన్ల ఉద్యోగాలు ఆక్రమించేవారిని అనుమతించే ప్రసక్తే లేదని ట్రంప్ చెప్పారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలు భారత ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపేవేనని నిపుణుల అంచనా. "ప్రతి అమెరికన్ జీవితాన్ని కాపాడేందుకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది" అని లోవాలో వేలాది మంది తన మద్దతుదారులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. డిస్నీ వరల్డ్, ఇతర యూఎస్ కంపెనీలను ప్రస్తావిస్తూ, అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలను విదేశీయులు తన్నుకు పోతున్నారని, దీన్ని అడ్డుకుంటామని తెలిపారు. "మీరు నమ్ముతారా? మిమ్మల్ని తీసేసి, ఆ స్థానంలో మీ చేత శిక్షణ పొందిన వారినే నియమిస్తున్నారు. దీనివల్ల దేశ పౌరుల భద్రత విఘాతంలో పడుతోంది" అని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News