: లారీ టమోటా రూ. 250 మాత్రమే.. ఆగ్రహించిన రైతులు!
నెలల తరబడి వారు పడిన శ్రమ రోడ్డు పాలయింది. కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకునే పంటను మార్కెట్ కు తీసుకువచ్చిన టమోటా రైతులకు వ్యాపారులు షాక్ ఇచ్చారు. కేజీ టమోటా రేటు కేవలం అర్ధ రూపాయి మాత్రమే అని వ్యాపారులు చెప్పడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. అంటే, 500 కిలోల లారీ లోడు ధర కేవలం రూ. 250 మాత్రమే అన్నమాట. దీంతో, అర్ధరూపాయికి తమ శ్రమను అమ్ముకోవడం కంటే లారీలతో పంటను తొక్కించడమే మేలంటూ... తాము తెచ్చిన టమోటాలన్నింటినీ రోడ్డుమీద పోసి, లారీలతో తొక్కిస్తున్నారు రైతులు. ఇది ఛత్తీస్ గఢ్ లోని రాయ గఢ్ జిల్లాలోని పరిస్థితి. కనీసం కూలీ ఖర్చులు కూడా రాకపోతే, పంటను పండించి ఏ ప్రయోజనం అంటూ రైతులు వాపోతున్నారు.