: రెండో బాల్ కే క్లీన్ బౌల్డ్ అయిన పుజారా
ముంబైలో ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మూడో రోజు ఆరంభంలోనే టీమిండియా తడబడింది. ఒక వికెట్ నష్టానికి 146 పరుగులతో మూడో రోజు ఆటను ఇండియా ప్రారంభించింది. తొలి ఓవర్ ను ఇంగ్లీష్ పేస్ బౌలర్ జేక్ బాల్ వేశాడు. రెండో బంతికే పుజారా బోల్తా పడ్డాడు. జేక్ విసిరిన గుడ్ లెంగ్త్ బాల్ హాఫ్ స్టంప్ ను గిరాటు వేసింది. దీంతో, మూడో రోజు ఒక్క పరుగు కూడా జత కాకుండానే ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఇండియా స్కోరు రెండు వికెట్ల నష్టానికి 146 పరుగులు. పుజారా పెవిలియన్ చేరడంతో... కెప్టెన్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. మరో ఎండ్ లో మురళీ విజయ్ 70 పరుగులతో ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా ఇంకా 254 పరుగులు వెనుకబడి ఉంది.